Ts constable hall tickets 2022||tslprb hall tickets download 2022||#tsconstable

Ts constable hall tickets 2022||tslprb hall tickets download 2022



 కానిస్టేబుల్ ప్రాథమిక అర్హత పరీక్ష హాల్ టికెట్లను అందుబాటులో ఉంచినట్లు పోలీసు నియామక సంస్థ వెల్లడించింది. గురువారం నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని, ఉదయం 8 నుంచి ఈ నెల 26 వ తేదీ రాత్రి 12 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్లో హాల్ టికెట్లను పొందవచ్చని పేర్కొంది. ఈ నెల 28న కానిస్టేబుల్ ఖాళీల భర్తీకి పోలీసు నియామక సంస్థ ప్రాథమిక అర్హత పరీక్ష నిర్వహిస్తోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 15644 పోలీసు కానిస్టేబుల్, 614 ఆబ్కారీ కానిస్టేబుల్, రవాణాశాఖలో 63 కానిస్టేబుల్ ఖాళీల భర్తీకి ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. ఈ పరీక్ష నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 1601 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 6,61, 196 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. మిగతా వివరాల కోసం 9393711110, 93911005006 నంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని పోలీసు నియామక సంస్థ వెల్లడించింది.

Download link

https://www.tslprb.in/account/login

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.