తెలంగాణ కానిస్టేబుల్ Exam 2022 Question Paper with answers

 తెలంగాణ కానిస్టేబుల్  Exam 2022 Question Paper with answers

Telangana Police Constable: తెలంగాణలో ఆదివారం జరిగిన కానిస్టేబుల్ రాత పరీక్షలో గందరగోళం నెలకొంది. రాత పరీక్ష రాసిన అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు.ముఖ్యంగా సి సిరీస్ ఓఎమ్మార్ షీట్ లో పొరపాట్లు జరిగాయంటూ అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. ప్రశ్నాపత్నం బుక్ కోడ్ లో ఆరు సంఖ్య రాగా.. దాని ఎలా బబ్లింగ్ చేయాలో అర్ధం కాక అభ్యర్థులు అయోమయానికి గురయ్యారు. పలు ప్రాంతాల్లో అభ్యర్థులు ఆందోళన చేశారు. దీంతో పోలీసు నియామకమండలి స్పందించింది. OMR షీట్లలో నెలకొన్న గందరగోళంపై క్లారిటీ ఇచ్చింది. బుక్ కోడ్ కేవలం నిర్ధారణ కోసమేనని... అది సరిగా నింపకున్నా అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. రాత పరీక్ష రాసిన అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీస్ నియామక మండలి తెలిపింది. బుక్ కోడ్ రాయకున్నా వాటిని మూల్యాంకనం చేస్తామని వెల్లడించింది.


ఆదివారం జరిగిన కానిస్టేబుల్ రాత పరీక్షలో 'సీ' సిరీస్ బుక్ లెట్ లో తప్పులు దొర్లాయి. క్యూబీ కోడ్ లో 6వ అంకె ప్రింట్ కావడంతో అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. సాధారణంగా ఓఎంఆర్ షీట్ ప్రశ్నాపత్నం బుక్ కోడ్ లో 1 నుంచి ఐదు నెంబర్లు ఉంటాయి. కాని కానిస్టేబుల్ ప్రశ్నాపత్నంలో క్యూబీ కోడ్ లో 6 నెంబర్ వచ్చింది. దీంతో ఎలా బబ్లింగ్ చేయాలో తెలియక అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. ఇన్విజిలేటర్లు పరిష్కారం చూపలేకపోయారు. అభ్యర్థుల ఆందోళనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పరీక్ష రాయాలని సూచించడంతో అభ్యర్థులు ఎగ్జామ్ రాశారు. కాని తమ ఓఎంఆర్ షీట్ ను పరిగణలోకి తీసుకుంటారోలేదోనని ఆందోళనకు గురవుతున్నారు. రాక రాక నోటిఫికేషన్ వచ్చిందని, చేయని తప్పుకు తాము బలికావాల్సి వస్తుందేమోనని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అభ్యర్థుల ఆందోళనతో క్లారిటీ ఇచ్చింది పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు.


Constable question paper with answer key pdf

https://drive.google.com/file/d/135oYCn50uV6POomxTAeu3naTEJ4hv_uw/view?usp=drivesdk

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.