పాలీసెట్ కౌన్సిలింగ్ వాయిదా

తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ వాయిదా పాలిటెక్నిక్కళాశాలల్లో ప్రవేశానికి మంగళవారం నుంచి ప్రారంభం కావాల్సిన పాలీసెట్ కౌన్సిలింగ్ 17వ తేదీకి వాయిదా పడింది. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. కోర్సుల ఆప్షన్లను 15వ తేదీ నుంచి ఎంచుకోవాలని గతంలో పేర్కొన్నారు .ఏఐసీటీఈ తెలంగాణలో 56 ప్రభుత్వ ,ఒక ఎయిడెడ్, 105 ప్రైవేట్ కళాశాలల కు ఆమోదం తెలిపిన వారికి రాష్ట్ర సాంకేతిక విద్య శిక్షణ మండలి అనుబంధ గుర్తింపు జారీ చేయాల్సి ఉంటుంది .అధ్యాపకులకు బయోమెట్రిక్ హాజరు లేదని కళాశాలలకు బోర్డు ఇప్పటికే నోటీసులు జారీ చేయడం, గై రహాజరు అయినా రోజులు సమానమైన వేతనాన్ని తన ఖాతాలో జమ చేయాలని ఆదేశించడం తెలిసిందే, అధిక సంఖ్యలో కళాశాలలకు ఇంకా అనుబంధ గుర్తింపు దక్కలేదు ఫలితంగా కౌన్సెలింగ్ వాయిదా వేశారు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.