జూన్ నుంచే పోలీస్ శిక్షణ

@తొలుత 1250 మంది ఎస్ఐలకు 
@జులైలో 17 వేల మంది కానిస్టేబుళ్లకు


పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో అధికారులు తదుపరి చేపట్టే శిక్షణ కోసం ఏర్పాటు చేస్తున్నారు. జూన్  నెల ఆఖరుకల్లా ఎస్ఐలు జూలై నుంచి కానిస్టేబుల్లకు శిక్షణ ఇస్తారు. దాదాపు 1250 మంది ఎస్సైలు 17 వేల మంది కానిస్టేబుల్ శిక్షణ ఇవ్వనున్నారు.


  1. రాష్ట్ర పోలీసు శాఖతో పాటు, అగ్నిమాపక, ప్రత్యేక భద్రతా దళం జైళ్ల శాఖలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి గతేడాది మే నెలలో ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే దాదాపు 18వేల నియామకాలకు సంబంధించి జారీ చేసిన ఈ ప్రకటనలో భాగంగా ఇప్పటికే ప్రాథమిక పరీక్షలు విజయవంతంగా పూర్తిచేశారు. ఫలితాలు శనివారం ప్రకటించారు. అనంతరం ధ్రువపత్రాల పరిశీలన అనంతరం ఖాళీలు రిజర్వేషన్ల ప్రాతిపదికన ఆయా ఉద్యోగాలకు కటాఫ్ మార్కులు ప్రకటించనున్నారు .దాంతో అభ్యర్థుల ఎంపిక పూర్తి అవుతుంది .తర్వాత ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది .ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అత్యధికంగా 13,000 మంది మాత్రమే శిక్షణ ఇచ్చారు .ఇప్పుడు ఏకంగా 18 వేల మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది పోలీస్ శిక్షణ అంటే తరగతి గదుల్లోనే పాటలతో పాటు వారి శారీరక దారుఢ్యం పెంపొందించడం  కోసం పోలీస్ శిక్షణ కళాశాల తో  తెలంగాణ ప్రత్యేక పోలీస్ పటాలానికి చెందిన 10 ఐ ఆర్ బెటాలియన్కు చెందిన మూడు మైదానాలను వాడుకో నున్నారు. ఇంత మందికి శిక్షణ ఇవ్వాలంటే శిక్షకులు కూడా అదే స్థాయిలో కావాలి ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 1000 మంది శిక్షకులను సిద్ధం చేస్తున్నారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.