వేసవి సెలవులు పొడగింపు

*వేసవి సెలవులు పొడగింపు
*పాఠశాలల పునః ప్రారంభం జూన్ 12న
*ఎండలు తీవ్రంగా ఉండటంతో సర్కార్ నిర్ణయం

రాష్ట్రంలో పాఠశాలల పునః ప్రారంభం తేదీ వాయిదా పడింది జూన్ 1వ తేదీ నుంచి కాకుండా 12 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది .తగ్గకపోవడంతో నేపథ్యంలో  పాఠశాలల పునః ప్రారంభం తేదీని వాయిదా వేయాలని బాలల హక్కుల సంఘం తదితర సంస్థల ప్రతినిధులు విద్యాశాఖ కమీషనర్ కార్యదర్శులకు విన్నవించారు .దీంతో వేసవి సెలవులను జూన్ 11 వరకు పొడిగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు .హక్కుల సంఘం గౌరవాధ్యక్షులు హర్షం వ్యక్తం చేశారు ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం స్వాగతించింది. కొంత వ్యవధి దొరికినందున బడి తెరిచిన మొదటి రోజే పాఠ్యపుస్తకాలు ఏకరూప దుస్తులు విద్యార్థులకు అందించేలా చర్యలు తీసుకోవాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగటి నారాయణ ప్రధాన కార్యదర్శి .పగడాల లక్ష్మయ్య ఒక ప్రకటనలో కోరారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.