నేటి నుంచి దోస్త్ ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభం

నేటి నుంచి  దోస్త్ ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభం@మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాలు

@ జూన్ 3 వరకు తొలి విడత రిజిస్ట్రేషన్లు

 @జూలై 1 నుంచి తరగతులు ప్రారంభం 

@పూర్తి కాలపట్టిక విడుదల. 

@ఇంటర్ సప్లిమెంటరీ విద్యార్థులకు అవసరమైతే మరో విడత కౌన్సెలింగ్.


రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్ దరఖాస్తులకు దరఖాస్తుల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 1049 కళాశాలలు ఈసారి దోస్త పరిధిలో ఉండగా వాటిలో మూడు విడతల్లో ప్రవేశాలు జరగనున్నాయి .బుధవారం రాష్ట్ర రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యదర్శి ఇ బి జనార్దన్ రెడ్డి దోస్త్ కన్వీనర్ ఆచార్య ఆర్ లింబాద్రి, విద్యా మండలి ఉపాధ్యక్షుడు వెంకట రమణ కార్యదర్శి, శ్రీనివాసరావు తదితరులు ప్రవేశాలకు సంబంధించిన పూర్తి విడుదల చేశారు. జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ దోస్తు లో మార్పులు చేసుకుంటూ విద్యార్థులకు సౌకర్యంగా ఉండేలా తీర్చిదిద్దుతామన్నారు. ఇంటర్ సప్లమెంటరీ ఫలితాలు వచ్చిన తర్వాత అందులో పాస్ అయిన వారి కోసం ప్రత్యేక రిజిస్ట్రేషన్ కౌన్సిలింగ్ కు అవకాశం కల్పిస్తామని పాపి రెడ్డి తెలిపారు .ఈసారి విశ్వవిద్యాలయాలు డిమాండ్ లేని కోర్సులపై దృష్టి పెట్టి సీట్లకు కోత విధించాలని ,దీంతో గతేడాది కంటే సీట్లు తగ్గుతాయని చెప్పారు .దోస్త్ కన్వీనర్ ర్ లింబాద్రి మాట్లాడుతూ సీట్ల సంఖ్యను ఒకటి రెండు రోజుల్లో వెల్లడిస్తామని ,సీటు పొందిన తర్వాత ప్రభుత్వ కళాశాలలో అయితే 500 రూపాయలు చెల్లించి రిజర్వు చేసుకోవచ్చని ,ప్రైవేట్ కళాశాలలో అయితే బోధనా రుసుము పొందేందుకు అర్హులు కాని వారు ఫీజులో 50 శాతం చెల్లించి సీట్లు రిజర్వు చేసుకోవచ్చని చెప్పారు.

మార్పులు లు కొత్త సౌకర్యాలు

గత గత ఏడాది మీ సేవ తో పాటు ఆధార్ అనుసంధానమైన మొబైల్ నుంచి విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునే వారు .ఈ సారి 82 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు విశ్వవిద్యాలయాలు మొత్తం 92 సహాయ కేంద్రం లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు .కొంతమందికి రిజిస్ట్రేషన్ సమయంలో చేతి వేలిముద్రలు నమోదు కావడం లేదు. అలాంటి వారికోసం జిల్లా కేంద్రంలోని  ఐరిస్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చారు.  సీట్ల కేటాయింపు తర్వాత కళాశాలలకు వెళ్లి రిపోర్టు చేయడం ఆన్లైన్ రుసుము చెల్లించడం కాకుండా ,ఈసారి ఎంసెట్ తరహాలో ఆన్లైన్లో  సెల్పులు రిపోర్టింగ్ విధానం  అమలు. దోస్త్ కు సంబంధించిన ప్రకటన కాలపట్టిక, కోర్సులు ,రుసుం, కళాశాలల వివరాలు అది ఉన్న ప్రాంతం తదితర వాటి కోసం దోస్త్ పేరిట యాప్ తీసుకొచ్చారు. చేరిన కళాశాలలో సీట్లు ఖాళీగా ఉంటే కోర్సులు మాద్యమం మార్చుకోవడానికి జూలై 5 నుంచి 7 వరకు విధించిన గడువు విధించారు . వీరికి జూలై 10వ తేదీన సీట్లు కేటాయిస్తారు

దోస్త్ కాలపట్టిక

రిజిస్ట్రేషన్: May 23 నుంచి జూన్ 3వ తేదీ వరకు 

Web ఆప్షన్లు: మే 25 నుంచి జూన్ 3 వరకు 

ఆలస్య రుసుముతో రిజిస్ట్రేషన్లు (400 రూ ) జూన్ 4

మొదటి విడత సీట్ల కేటాయింపు :జూన్ 10 

ఆన్ లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ కళాశాల
 రుసుము చెల్లింపు :
జూన్ 10 నుంచి 15 వరకు 

రెండో విడత రిజిస్ట్రేషన్లు :జూన్ 10 నుంచి 15 వరకు 

వెబ్ ఆప్షన్లు: జూన్ 10 నుంచి 15 వరకు

 సీట్ల కేటాయింపు :జూన్ 20

ఆన్లైన్ ద్వారా సెల్పులు రిపోర్టింగ్ కళాశాల
 రుసుము చెల్లింపు :
జూన్ 20 నుంచి 25 వరకు 

చివరి విడత :

రిజిస్ట్రేషన్లు వెబ్ ఆప్షన్ జూన్ 20 నుంచి 25 వరకు

సీట్ల కేటాయింపు: జూన్ 29 

ఆన్లైన్ ద్వారా సెల్పులు రిపోర్టింగ్ కళాశాల
 రుసుం చెల్లింపు :జూలై 1 నుంచి 4 వరకు 

ఆన్లైన్ ద్వారా ఒకటి రెండు మూడు విడతల్లో సీట్లు నిర్ధారించుకున్న వారు కళాశాలలో స్వయంగా రిపోర్ట్ చేయాల్సిన గడువు జూలై 1 నుంచి 4 వరకు 

తరగతులు ప్రారంభం  ప్రథమ సెమిస్టర్: july 1

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.