ఐ సెట్ కు 90 శాతం హాజరు

తెలంగాణలోని ఎంబీఏ, ఎంసీఏ లో 2019 20 విద్యా సంవత్సరానికి గురువారం రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ప్రవేశ పరీక్ష( ఐ సెట్ 2019కి 90 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. ప్రశ్న పత్రాన్ని వైస్ చైర్మన్ కేయూ ఉపకులపతి ఆన్లైన్ ద్వారా విడుదల చేశారు .ఉదయం 10 నుంచి 12 :30గంటల వరకు మధ్యాహ్నం 2 :30నుంచి 5 గంటల వరకు పరీక్ష జరిపారు. మొత్తం 55 కేంద్రాల్లో దీనిని నిర్వహించారు తొలి విడతలో 16630 మంది పేర్లను నమోదు చేసుకోగా ,14920 మంది పరీక్ష రాశారు .అనంతరం 16440 మందికి గాను 14859 మంది హాజరయ్యారని కన్వీనర్ ఆచార్య సిహెచ్ రాజేశం తెలిపారు .శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.