ఈనెల 31న ఉద్యోగ మేళా


సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల  31న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ బాలకిష న్ తెలిపారు.మంగళవారం కళాశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.సదాశివపేట లోని రాణే లిమిటెడ్ కంపెనీలో నియామకాల కోసం ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు వివరించారు.ఇంటర్ ,ఒకేషనల్ కోర్సు 50 శాతం ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అర్హులు అని స్పష్టం చేశారు. ఎంపికైన విద్యార్థులకు తొలి సంవత్సరం 9000,ద్వితీయ సంవత్సరం 10500 ,3 వ సంవత్సరం 12 వేల నిరుద్యోగ భృతి ,ఉచిత  వసతితో పాటు, శిక్షణ అందిస్తారని చెప్పారు.అనంతరం నైపుణ్యం ఆధారంగా పూర్తిస్థాయి వేతనాన్ని నిర్ణయిస్తారని చెప్పడం జరిగింది. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యే ఈ మేళాలో ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఒరిజినల్ పత్రాలు, ఆధార్ కార్డు తో సహా హాజరుకావాలని సూచించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.