జూన్ 3 లేదా 4న ఎంసెట్ ఫలితాలు


తెలంగాణ ఎంసెట్ ఫలితాలు జూన్ 3 లేదా 4వ తేదీన విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు .తప్పిన విద్యార్థుల పున పరిశీలన ఫలితాలను ఈ నెల 27వ తేదీన వెల్లడించిన విషయం తెలిసిందే .ఇంటర్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకున్న సుమారు 40 వేల మంది విద్యార్థులు ఫలితాలను మూడు రోజుల లోపు ఇస్తామని అధికారికంగా ప్రకటించిన ఖచ్చితమైన తేదీ చెప్పలేదు. జె ఎన్ టి యు హెచ్ ఉప కులపతి ఆచార్య వేణుగోపాల రెడ్డి మంగళవారం ఉదయం అధికారులతో మాట్లాడారు.మూడు లేదా నాలుగు రోజులు పట్టవచ్చని వారు చెప్పినట్లు తెలిసింది .అంటే ఫలితాలు వెల్లడించిన ఆ తర్వాత ఎంసెట్ ర్యాంకుల వెల్లడి ఒకటి రెండు రోజులు పడుతుందని ముందుగా అనుకున్నట్లు జూన్ 3వ తేదీన విడుదల చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు .అయితే జూన్ 3న ఆయన ఢిల్లీలో ఎస్సీ కమిషన్ ఎదుట హాజరు కావాల్సి ఉంటే మాత్రం 4న ఫలితాలు విడుదల చేయాలనే నిర్ణయానికి ఎంసెట్ అధికారులు వచ్చినట్లు సమాచారం. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.